కోల్ కతా నైట్ రైడర్స్ టార్గెట్ 104 రన్స్
NEWS Apr 11,2025 09:25 pm
చెన్నై వేదికగా జరుగుతున్న ఐపీఎల్ 2025 లీగ్ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ చేతులెత్తేసింది. కోల్ కతా నైట్ రైడర్స్ స్కిప్పర్ అజింక్యా రహానే టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. తన అంచనా తప్పలేదు. కోల్ కతా బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. 57 డాట్ బాల్స్ వేయడం విశేషం. ఈ టోర్నీలో ఇది రికార్డ్. రచిన్ రవీంద్ర 4, కాన్వే 12, త్రిపాఠి 16, విజయ్ శంకర్ 29 , శివమ్ దూబే 31, అశ్విన్1, జడేజా , హూడా డకౌట్ అయ్యారు. ఇక కేకేఆర్ బౌలర్లలో అలీ 1, సునీల్ నరైన్ 3, వరుణ్ చక్రవర్తి 2, హర్షిత్ రాణా 2 వికెట్లు తీశాడు. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 103 రన్స్ చేశారు చెన్నై సూపర్ కింగ్స్.