మేడారం వనదేవతలను దర్శించుకున్న ప్యారడైస్ చిత్ర యూనిట్
NEWS Sep 29,2026 11:07 pm
ప్యారడైజ్ సినిమా బృందం మేడారం సమ్మక్క-సారలమ్మ తల్లులను దర్శించుకుంది. ములుగు జిల్లా కేంద్రంలోని ఘట్టమ్మ తల్లి అమ్మవార్లను హీరో నానితో పాటు నటుడు సంపూర్ణేష్ బాబు, దర్శకుడు శ్రీకాంత్ వదల చిత్ర బృందం దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అక్కడి నుంచి తాడ్వాయి మండలంలోని మేడారం సమ్మక్క- సారలమ్మ వనదేవతల వద్దకు చేరుకున్నారు.ఆ మనదేవతల వద్ద చిత్ర బృందం అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కలు చెల్లించుకున్నారు. అభిమానులు పెద్ద ఎత్తున తరలి రావడంతో ఆ ప్రాంతం సందడి వాతావరణం నెలకొంది.