తెలంగాణలో టెట్ నోటిఫికేషన్ రిలీజ్
NEWS Apr 11,2025 08:34 pm
రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు తీపి కబురు చెప్పింది. ఉపాధ్యాయ అర్హతా పరీక్ష (టెట్ ) కు సంబంధించి 2025 సంవత్సరానికి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. వచ్చే జూన్ 15 నుంచి 30 వరకు టెట్ పరీక్షలు నిర్వహిస్తామని తెలిపింది. ఆసక్తి కలిగిన నిరుద్యోగులు, అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని సూచించింది విద్యా శాఖ.