పేరుకే మంత్రి నడిపించేదంతా లోకేష్
NEWS Apr 10,2025 10:00 am
మాజీ మంత్రి అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో హోం మంత్రి అనిత వంగలపూడికి ఎలాంటి పవర్స్ లేవన్నారు. కావాలని తమ పార్టీకి చెందిన వారిని టార్గెట్ చేస్తున్నారని, అక్రమ కేసులు నమోదు చేస్తున్నారంటూ ఆరోపించారు. అనిత మైకు ముందే మంత్రి అని, తెర వెనుక నడిపించేదంతా మంత్రి నారా లోకేష్ అంటూ ఫైర్ అయ్యారు. తమ నేతలను బెదిరించి, భయపెట్టే పోలీసులను గుర్తు పెట్టుకుంటామని, తాము పవర్ లోకి వచ్చాక వారి పని పడతామని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.