అమెరికా ఉత్పత్తులపై చైనా సుంకం
NEWS Apr 04,2025 06:45 pm
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు బిగ్ షాక్ ఇచ్చారు చైనా దేశాధ్యక్షుడు జిన్ పింగ్. తమ దేశంపై సుంకాలు విధించడంపై సీరియస్ అయ్యారు. అందుకు ప్రతీకార చర్యలకు శ్రీకారం చుట్టారు. అమెరికా ఉత్పత్తులపై 34 శాతం సుంకం విధిస్తున్నట్లు ప్రకటించారు. పెరిగిన సుంకాలు ఈనెల 10వ తేదీ నుంచి అమలులోకి వస్తాయని ప్రకటించారు ప్రెసిడంట్. ఇదిలా ఉండగా చైనాపై యుఎస్ 34 శాతం సుంకం విధించిన విషయం విదితమే.