మనోజ్ కుమార్ మృతి తీరని లోటు
NEWS Apr 04,2025 02:18 pm
ప్రముఖ హిందీ నటుడు, దర్శకుడు మనోజ్ కుమార్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. భారతీయ చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. తను రూపొందించిన చిత్రాల్లో జాతీయ భావాలను పెంపొందించేలా చూశారని పేర్కొన్నారు. రోటీ కపడా ఔర్ మకాన్, క్రాంతి, ఉపకార్ చిత్రాలు తన నిబద్దతకు అద్దం పడతాయని తెలిపారు. దేశం అంటే మనోజ్ కుమార్ కు ఎనేలని అభిమానం అన్నారు. తన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియ చేస్తున్నట్లు పేర్కొన్నారు పవన్ కళ్యాణ్.