శ్రీరామనవమి శోభాయాత్రకు భారీ బందోబస్తు
NEWS Apr 04,2025 09:50 am
హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ కీలక ప్రకటన చేశారు. ఆదివారం జరిగే శ్రీరామనవమి పండుగ సందర్బంగా నగరంలో నిర్వహించే శోభాయాత్రపై స్పందించారు. అనుకున్న సమయానికే శోభాయాత్రను ప్రారంభించి..ముగించాలని స్పష్టం చేశారు. దొంగతనాలు, ఈవ్ టీజింగ్ లాంటివి నియంత్రించే దిశగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.