మాజీ సీఎం కేసీఆర్ పై కేసు కొట్టివేత
NEWS Apr 04,2025 09:47 am
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు భారీ ఊరట లభించింది. తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ పై రైల్ రోకో కేసు నమోదైంది. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు కేసు కొట్టివేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో బిగ్ రిలీఫ్ దక్కింది మాజీ సీఎంకు. అంతకు ముందు తాను లేకున్నా తనపై కావాలని అప్పటి సర్కార్ కేసు నమోదు చేసిందని ఆరోపించారు . ఈ మేరకు కేసు కొట్టివేయాలని కోరుతూ కోర్టును ఆశ్రయించారు.