రామ్ గోపాల్ వర్మకు బిగ్ రిలీఫ్
NEWS Apr 04,2025 08:22 am
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు బిగ్ రిలీఫ్ లభించింది. ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఆర్జీవీపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దంటూ సీఐడీకి ఆదేశించింది. విచారణకు రావాలంటూ దర్శకుడికి నోటీసులు జారీ చేయడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ వర్మ హైకోర్టును ఆశ్రయించారు. తాను ప్రస్తుతం షూటింగ్ లో బిజీగా ఉన్నానని, తనపై కావాలని కూటమి సర్కార్ కక్ష సాధింపు చర్యలకు దిగుతోందంటూ ఆరోపించారు .