అలిపిరి టోల్ గేట్ ఆకస్మిక తనిఖీ
NEWS Apr 03,2025 05:44 pm
తిరుపతి లోని అలిపిరి టోల్ గేట్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు తిరుమల తిరుపతి దేవస్థానం చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ వి హర్షవర్ధన్ రాజు. వాహనాల తనిఖీలలో అప్రమత్తంగా ఉండాలన్నారు. టోల్ గేట్ లో భక్తులు తిరుమల చేరుకునేందుకు ఎలాంటి జాప్యం లేకుండా చర్యలు తీసుకొవాలని స్పష్టం చేశారు. అలిపిరి టోల్ గెట్ వద్ద విఐపి వాహనాలు, సామాన్య ప్రజల కార్లు వెళ్లే మార్గంతో పాటు ద్విచక్ర వాహనాలు వెళ్లే మార్గాలను పరిశీంచి పలు సూచనలు చేశారు.తిరుమలకు వెళుతున్న ద్విచక్ర వాహనాలు, కార్లులను సిబ్బంది చెకింగ్ చేస్తూ అప్రమత్తంగా ఉండాలన్నారు. వాహనాలు వెళ్ళుతున్న సమయంలో స్కానింగ్ జరుగుతున్న విధానాన్ని పరిశీలించారు.