నా ధైర్యం నా బ్రాండ్ ఒక్కడే సీబీఎన్
NEWS Apr 02,2025 03:26 pm
మంత్రి నారా లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన ధైర్యం, తన బ్రాండ్ తన తండ్రి చంద్రబాబు అని స్పష్టం చేశారు. తెలంగాణాకు హైదరాబాద్, తమిళనాడుకి చెన్నై, కర్ణాటకకి బెంగుళూరు ఉంది.. మాకు చంద్రబాబు ఉన్నారని అన్నారు. ఆయన నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రూపు రేఖలు తప్పకుండా మారుస్తారని చెప్పారు. రాబోయే ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా మేనిఫెస్టోలో పెట్టాలని సీఎం చంద్రబాబును కోరానని తెలిపారు.