గజవాహనంపై శ్రీ కోదండరాముడు
NEWS Apr 02,2025 07:56 am
తిరుపతిలోని శ్రీ కోదండరామ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవోపేతంగా కొనసాగుతున్నాయి. ఆరో రోజు రాత్రి 7 గంటలకు స్వామి వారు గజ వాహనంపై భక్తులకు అభయమిచ్చారు. గజరాజులు, వృషభాలు, అశ్వాలు ముందు కదులుతుండగా, భజన బృందాలు కోలాటాలు ఆడుతుండగా స్వామివారు నాలుగు మాడవీధుల్లో విహరించారు. భక్తులు అడుగడుగునా కర్పూర నీరాజనాలు అందించారు.