సాగులో ఒంగోలు జాతి ఎడ్లకు తిరుగు లేదు
NEWS Apr 02,2025 06:52 am
వ్యవసాయ రంగంలో ఒంగోలు జాతి ఎడ్లు కీలకమైన పాత్ర పోషిస్తున్నాయని ప్రశంసలు కురిపించారు మంత్రి నిమ్మల రామా నాయుడు. గుంటూరు జిల్లా తెనాలి మార్కెట్ యార్డులో జరిగిన 8 వ ఒంగోలు జాతి జాతీయ స్థాయి , ఎడ్ల బల, పశుపాల ప్రదర్శన పోటీలకు ముఖ్య అతిథిగా హాజరై, విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. దేశానికి గర్వకారణమైన ఒంగోలు జాతి ఎడ్ల పోటీలు నిర్వహిస్తున్న ఆలపాటి రాజా అభినందనీయుడన్నారు. ఒంగోలు జాతి ఎడ్లు అంటే దేశానికే కాదు, యావత్ ప్రపంచానికే ఆదర్శమన్నారు.