చైనా ప్రపంచంలోనే తొలిసారిగా ఫ్లయింగ్ ట్యాక్సీలకు అనుమతి ఇచ్చింది. ఈ పైలట్ రహిత ఎగిరే ట్యాక్సీలకు అనుమతి ఇవ్వడం ప్రపంచ సాంకేతిక రంగంలో పెను మార్పులకు నాంది. క్వాంటమ్ కంప్యూటింగ్, AI, 6G నెట్‌వర్క్‌లతో పాటు తక్కువ ఎత్తులో ఎగిరే డ్రోన్లు, బెలూన్లు, ఫ్లయింగ్ కార్లను చైనా ప్రోత్సహిస్తోంది. చైనా జర్నలిస్ట్ పోస్ట్ చేసిన ఎయిర్ టాక్సీ వీడియో వైరల్ అవుతోంది.