గంజాయి అమ్ముతున్న నిందితున్ని పట్టుకున్న సిసిఎస్ పోలీసులు
NEWS Apr 01,2025 11:40 pm
జగిత్యాల రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అంతర్గం గ్రామంలో పోలీసులు గంజాయి పట్టుకున్నారు. గంజాయి అమ్ముతున్నారన్న సమాచారం మేరకు సీసీఎస్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో తనిఖీ చేయగా నాగశెట్టి స్వామి(సన్నీ) (వయస్సు 21సం.లు), అంతర్గం గ్రామంలో వ్యక్తి వద్ద 130 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకొని రూరల్ పోలీసులకు అప్పగించి కేసు నమోదు చేశారు.