బాబు జగ్జీవన్ విగ్రహం ఏర్పాటు చేయాలి
NEWS Apr 01,2025 11:35 pm
మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాన్ని జగిత్యాల జిల్లా కేంద్రంలో వెంటనే ఏర్పాటు చేయాలని గత 11 సంవత్సరాలుగా భూమి పూజతోనే సరిపెట్టుకోవడం సబబుగా లేదని తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం, ప్రజాసంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ పేట భాస్కర్ ఆరోపించారు. జిల్లా కలెక్టర్, ప్రజా ప్రతినిధులు చొరవ తీసుకుని విగ్రహ ఏర్పాటులో అడ్డుతగులుతున్న అక్కడి ప్రాంత వాసులను సమన్వయం చేసి ఈనెల 5న జరగబోయే జయంతోత్సవాలకు విగ్రహం నెలకొల్పాలని కోరారు.