అంబేద్కర్ విగ్రహం తొలగించొద్దు
NEWS Apr 01,2025 11:34 pm
కోరుట్ల:పెద్దపల్లి జిల్లా గోదావరిఖని మున్సిపల్ఆఫీస్ పక్కన తీన్ రాస్తాలో అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించాలనుకోవడం సరికాదని ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘ నాయకులు అన్నారు. కేంద్ర మాజీ మంత్రి, దివంగత కాకా వెంకటస్వామి ఆర్థిక సహాయంతో మంత్రి శ్రీధర్ బాబు తోడ్పాటుతో మున్సిపల్ మాజీ చైర్మన్ స్వర్గీయ బడికెల రాజలింగం ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారని చెప్పారు. అంబెడ్కర్ విగ్రహన్ని తొలగించి మరో చోట ఏర్పాటు చేసే ప్రతిపాదనను విరమించుకోవాలన్నారు.