విప్ అడ్లూరి లక్ష్మణ్ జన్మదిన వేడుకలు
NEWS Apr 01,2025 10:00 pm
ధర్మపురి నియోజకవర్గ శాసనసభ్యులు, డిసిసి అధ్యక్షులు, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ కుమార్ జన్మదినాన్ని పురస్కరించుకొని కాంగ్రెస్ నాయకులు కొమిరెడ్డి కరంచంద్ మెట్‌పల్లిలోని ఆయన నివాసంలో కార్యకర్తల మధ్య కేక్ కట్ చేసి, స్వీట్లు పంచారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజా శ్రేయస్సు కోసం నిరంతరం పరితపించే అడ్లూరి లక్ష్మణకుమార్ ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకుంటూ ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు.