మే నెల నుంచి కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు
NEWS Apr 01,2025 06:39 pm
మంత్రి నాదెండ్ల మనోహర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొత్త రేషన్ కార్డులో క్యూ ఆర కోడ్, ఇతర భద్రతా ఫీచర్లు ఉంటాయన్నారు. ఈ-కేవైసీ పూర్తయితే ఎంతమందికి కార్డులు ఇవ్వాలో క్లారిటీ వస్తుందన్నారు. ఇవాల్టీ నుంచే దీపం-2 రెండో విడత సిలిండర్ బుకింగ్ ప్రారంభమైందన్నారు. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు ప్రక్రియ కొనసాగుతోందని చెప్పారు. వాట్సప్ ద్వారా కూడా ధాన్యం అమ్ముకునే అవకాశాన్ని కల్పించామన్నారు. వాట్సప్ ద్వారా 16 వేల మంది రైతులు ధాన్యాన్ని విక్రయించారని తెలిపారు. రైతులకు గన్నీ బ్యాగ్స్ కొరత లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.