కొడాలి నాని ఆరోగ్యం ఆందోళనకరం
NEWS Apr 01,2025 09:32 am
మాజీ మంత్రి కొడాలి నాని ఆరోగ్యం ఆందోళనకరంగా ఉన్నట్టు సమాచారం. మూడు రక్త నాళాలు పూర్తిగా బ్లాక్ అయినట్లు వైద్యులు నిర్ధారించారు. సర్జరీ కూడా చేయలేని పరిస్థితి నెలకొంది. దీంతో హుటా హుటిన ఎయిర్ అంబులెన్స్ లో ముంబైకి తరలించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నట్లు సమాచారం. నాని హెల్త్ కండీషన్ కు సంబంధించి వైద్యులు ఇంకా వివరాలు వెల్లడించలేదు.