భద్రాచలంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు
NEWS Apr 01,2025 08:04 am
ప్రముఖ పుణ్య క్షేత్రం భద్రాచలంలోని రాములోరి ఆలయం బ్రహ్మోత్సవాలకు సిద్దమైంది. ప్రభుత్వం భారీ ఎత్తున ఏర్పాట్లు చేసింది. సర్కార్ తరపున స్వామి, అమ్మ వార్లకు పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. ఈనెల 5న శ్రీ సీతారాముల ఎదుర్కోలు మహోత్సవం జరగనుంది. 7న సీతా రాముల మహా పట్టాభిషేకం వేడుక నిర్వహిస్తారు. ఉత్సవాలను పురస్కరించుకుని ఆలయ కమిటీ ఏప్రిల్ 12 వరకు ఆలయంలో జరిగే నిత్య కళ్యాణాలను నిలిపి వేసినట్లు ఈవో వెల్లడించారు.