మెరుగైన చికిత్స కోసం ముంబైకి కొడాలి నాని
NEWS Mar 31,2025 01:36 pm
మాజీ మంత్రి కొడాలి నాని అనారోగ్యానికి గురి కావడంతో సోమవారం మెరుగైన చికిత్స కోసం ముంబైకి బయలు దేరి వెళ్లారు. కొద్ది రోజుల కిందట హైదరాబాద్ లోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందారు. ఐదు రోజుల అనంతరం డిశ్చార్జ్ చేశారు. గుండెకు సంబంధించి సమస్యతో బాధ పడుతున్నారు. కొద్ది సేపటి కిందట కొడాలి నానిని తీసుకుని ముంబైకి తీసుకు వెళ్లారు కుటుంబీకులు.