ఈద్గాల దగ్గర పటిష్ఠ బందోబస్తు - ఎస్పీ
NEWS Mar 31,2025 08:06 am
MBNR: రంజాన్ పండగను పురస్కరించుకొని ఈద్గాల దగ్గర పటిష్ఠ బందోబస్తు ఏర్పాట్లను పకడ్బందీగా అమలు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ జానకి తెలిపారు. జిల్లాలోని పోలీసు అధికారులతో ఆమె టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా పోలీసులు 24 గంటలపాటు విధుల్లో ఉంటారన్నారు. ఈద్గాల వద్ద అదనపు బలగాలను మోహరించినట్లు ఎస్పీ తెలిపారు.