చేతులెత్తేసిన సన్ రైజర్స్ హైదరాబాద్
NEWS Mar 30,2025 05:18 pm
ఐపీఎల్ 2025 టోర్నీలో భాగంగా విశాఖపట్టణం వేదికగా జరిగిన లీగ్ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఆశించిన మేర రాణించలేదు. ఎస్ఆర్ హెచ్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. దీంతో ఆశించిన మేర రాణించ లేక పోయారు. నిర్ణీత ఓవర్లలో 163 రన్స్ మాత్రమే చేశారు. క్లాసెన్ 2 ఫోర్లు 2 సిక్సర్లతో 32 రన్స్ చేయగా అనికేత్ వర్మ అద్భుతంగా ఆడాడు. 41 బంతులు మాత్రమే ఆడి 74 రన్స్ చేశాడు. 5 ఫోర్లు 6 బిగ్ సిక్సర్లతో రెచ్చి పోయాడు. ఢిల్లీ క్యాపిటల్స్ ముందు 164 పరుగుల లక్ష్యం ఉంది.