న్యూస్ లైన్ ఛానల్ యజమాని అరెస్ట్
NEWS Mar 29,2025 08:33 pm
న్యూస్ లైన్ యూట్యూబ్ ఛానల్ యజమాని చలమల శంకర్ గౌడ్ ను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. బాగ్ అంబర్ పేట్ సీఈ కాలనీంలో నివాసం ఉంటున్న మహిళను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని, లైంగికంగా వాడుకుని పట్టించు కోవడం లేదంటూ ఫిర్యాదు చేసిందన్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు శంకర్ గౌడ్ పై క్రైమ్ నెంబర్ 135/2025, U/s 69, 79, 352, 351(4) బీఎన్ఎస్ కింద కేసు నమోదు చేశామన్నారు. శంకర్ గౌడ్ నుంచి ఫోర్డ్ కారు, డెల్ లాప్ టాప్ , ఒప్పో మొబైల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నామన్నారు. నాంపల్లి కోర్టులో హాజరు పర్చినట్లు తెలిపారు.