కార్యకర్తలే తెలుగుదేశం పార్టీకి బలం
NEWS Mar 29,2025 08:21 pm
కార్యకర్తలే టీడీపీకి బలమని అన్నారు సీఎం చంద్రబాబు. వేల మందితో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. పార్టీ 43వ ఆవిర్భావ శుభాకాంక్షలు తెలిపారు. మన కుటుంబంలోని సభ్యులందరికీ ఇవాళ పండుగ రోజు అన్నారు. వివిధ వర్గాల ప్రజలు రకరకాల పండుగలు జరుపుకుంటారని, కానీ అన్నివర్గాల వారు జరుపుకునే పండుగ టీడీపీ ఆవిర్భావ దినోత్సవమన్నారు. ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసిందన్నారు. నాలుగు దశాబ్దాలుగా పార్టీతో నడుస్తున్న నాయకులు, కార్యకర్తలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని అన్నారు సీఎం. ఏ పార్టీకి లేనటువంటి సిద్ధాంతాలతో మనం ముందుకెళ్తున్నామని అన్నారు.