పవన్ కళ్యాణ్ గురించి ఇష్టమొచ్చినట్లు కామెంట్లు చేస్తే బట్టలూడదీసి కొడతామని హెచ్చరించారు జనసేన పార్టీ నేత కిరణ్ రాయల్ . సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులపై వైసీపీ వాళ్లు ఇష్టమొచ్చినట్లు కామెంట్లు పెడుతున్నారని ఆరోపించారు. ఇంట్లో వాళ్లపై నోటికొచ్చింది మాట్లాడితే చూస్తూ ఊరుకుంటాం అనుకుంటున్నారా ? తాట తీస్తాం అని వార్నింగ్ ఇచ్చారు. 24 గంటల్లో పవన్ కళ్యాణ్ పై కామెంట్స్ పెట్టిన వాళ్లను పోలీసులు అరెస్ట్ చేయాలన్నారు. మేమే అధికారంలో ఉండి మళ్లీ మేమే రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేస్తే బాగుండదన్నారు.