ఉత్సవ ఏర్పాట్లను పరిశీలించిన అడిషనల్ కలెక్టర్
NEWS Mar 28,2025 07:22 pm
ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి చిన్న జయంతి ఉత్సవాలు సమీపిస్తున్నందున, ఉత్సవ ఏర్పాట్లను అడిషనల్ కలెక్టర్ బిఎస్ లత శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా విచ్చేసిన ఆమె ఆలయ పరిసర ప్రాంతాలను అధికారులతో కలిసి కలియ తిరిగారు. ఆమె వెంట ఆర్డీవో మధుసూదన్, ఈవో శ్రీకాంత్ రావు, తహసీల్దార్ మునీందర్, ఆర్ఐ తిరుపతి, పర్యవేక్షకులు, సునీల్, వెంకటేష్ ఉన్నారు.