తాను ఎలాంటి భూమి కబ్జాకు పాల్పడ లేదని అన్నారు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. సుప్రీం కోర్టు ఇచ్చిన ఆర్డర్ కాపీని పోలీస్ స్టేషన్ లో ఇచ్చానని చెప్పారు. పోలీసులు మళ్లీ పిలిస్తే తప్పకుండా విచారణకు హాజరు అవుతానని అన్నారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే తనపై కేసులు నమోదు చేశారని ఆరోపించారు. ఇది మంచి పద్దతి కాదన్నారు మాజీ ఎమ్మెల్యే. కేసులకు భయపడే ప్రసక్తి లేదన్నారు.