శ్రీ గోవిందరాజ స్వామి ఆలయంలో ఉత్సవాలు
NEWS Mar 28,2025 01:22 pm
ఏప్రిల్ నెలలో శ్రీ గోవింద రాజ స్వామి వారి ఆలయంలో విశేష ఉత్సవాలు జరగనున్నాయి. 3న రోహిణి నక్షత్రం సందర్భంగా సాయంత్రం 6 గంటలకు రుక్మిణి, సత్యభామ సమేత శ్రీపార్థసారధిస్వామి వారు మాడ వీధుల్లో ఊరేగి భక్తులను కటాక్షిస్తారు. 4న,8వ తేదీల్లో శుక్రవారాల్లో సాయంత్రం 6 గంటలకు శ్రీ ఆండాళ్ అమ్మవారిని ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహిస్తారు. 6న శ్రీ రామనవమి సందర్భంగా సాయంత్రం శ్రీ సీత లక్ష్మణ ఆంజనేయ సమేత శ్రీపట్టాభిరామస్వామి వారు మాడ వీధుల్లో భక్తులకు అభయమిస్తారు. 12న పౌర్ణమి మరియు ఉత్తర నక్షత్రం సందర్భంగా సాయంత్రం గరుడ వాహనంపై శ్రీ గోవిందరాజస్వామివారు విహరించి భక్తులను అనుగ్రహించనున్నారు. మే2వ తేదీ వరకు ఉత్సవాలు జరగనున్నాయి.