కోరుట్లలో పేకాట రాయుళ్ల అరెస్ట్
NEWS Mar 28,2025 01:26 pm
కోరుట్ల పట్టణంలోని ఓ ఇంట్లో పేకాట ఆడుతున్నారన్న సమాచారంతో సీసీఎస్ పోలీసులు దాడి చేశారు.పేకాట ఆడుతున్న ఆరుగురిని అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి రూ.22,920 , ఆరు మొబైల్ ఫోన్స్ ను సీజ్ చేసినట్లు తెలిపారు. పట్టుబడ్డ వారిని కోరుట్ల పోలీసులకు అప్పగించి కేసు నమోదు చేశారు. ఎస్పీ ఆదేశాలతో అక్రమ, అసాంఘిక కార్యక్రమాలపై నిఘా పటిష్టం చేశామన్నారు. పక్కా సమాచారంతో దాడులు చేపట్టినట్లు సీసీఎస్ ఎస్ఐ శ్రీనివాస్ తెలిపారు.