MBNR: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో సిటీ స్కాన్ యంత్రం పనిచేయక దాదాపు మూడు నెలల కాలం అవుతుంది. సిటీ స్కాన్ యంత్రం పనిచేయని కారణంగా పేద, మధ్య తరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సిటీ స్కాన్ బయట తీసుకురండి అంటూ వైద్యులు ప్రైవేట్ ఆస్పత్రులకు రిఫర్ చేస్తున్నారు. వేల రూపాయలు పెట్టలేక పేద ప్రజలు వైద్యాన్ని మానుకుంటున్నారు.