ప్రత్యర్థి జట్టు ఏదైనా సరే మ్యాచ్ కు సంబంధించి తొలి బంతి నుంచే విరుచుకుపడే సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు కోలుకోలేని రీతిలో ఝలక్ ఇచ్చాడు స్టార్ బౌలర్ లఖ్ నవూ సూపర్ జెయింట్స్ కు చెందిన బౌలర్ శార్దూల్ ఠాకూర్. కేవలం 4 ఓవర్లలో 34 పరుగులు మాత్రమే ఇచ్చి 4 కీలక వికెట్లు తీశాడు. ఇక లఖ్ నవూ బౌలర్ల దెబ్బకు దుర్భేద్యమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న ఎస్ ఆర్ హెచ్ బ్యాటర్లు పెవిలియన్ బాట పట్టారు. రాజస్థాన్ రాయల్స్ తో చెలరేగి పోయి, సూపర్ సెంచరీతో దుమ్ము రేపిన ఇషాన్ కిషన్ దెబ్బకు డకౌట్ అయ్యాడు. పెవిలియన్ బాట పట్టాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్ ఆర్ హెచ్ 9 వికెట్లు కోల్పోయి 190 రన్స్ మాత్రమే చేసింది.