కేసీఆర్ ను ఖతం చేయాలనుకుంటే ఎలా..?
NEWS Mar 27,2025 06:27 pm
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. మాజీ సీఎం కేసీఆర్ ను ఖతం చేసి కేటీఆర్, హరీశ్ రావు ఆయన కుర్చీలో కూర్చోవాలని చూస్తున్నారంటూ ఆరోపణలు చేశారు. తెలంగాణ కోసం పోరాటం చేసిన కేసీఆర్ ఇంకొన్నేళ్ల పాటు ఉండాలని అన్నారు. రాష్ట్ర ప్రజలంతా ఆయన నిండు నూరేళ్లు బతకాలని కోరుకుంటున్నారని, ఆయనను బతకనీయాలని సూచించారు. ఈ సందర్బంగా సీఎం నోరు జారడంపై తీవ్ర అభ్యంతరం తెలిపారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. రేవంత్ రెడ్డి తన పదవిని అడ్డం పెట్టుకుని ఇష్టానుసారం మాట్లాడటం మంచి పద్దతి కాదన్నారు.