అనారోగ్యంతో ఆస్పత్రి పాలైన మాజీ మంత్రి కొడాలి నాని గురువారం హైదరాబాద్ లోని ఏఐజీ ఆస్పత్రి నుంచి విడుదలయ్యారు. కొడాలి నానికి నిర్వహించిన హెల్త్ టెస్టుల్లో గుండె కవాటాల్లో క్లాట్లు ఉన్నట్లు గుర్తించారు వైద్యులు. క్లాట్లకు సంబంధించి అంత అత్యవసరంగా చికిత్స చేయించు కోవాల్సిన అవసరం లేదని సూచించారు. స్టంట్ లు వేయడమా, బైపాస్ సర్జరీ చేయడమా అనేదానికి సంబంధించి ఇంకా నిర్ణయించు కోలేదు కొడాలి నాని. సెకండ్ ఒపీనియన్ కోసం ఇతర హాస్పిటల్స్ సంప్రదించనున్నారు. ఉగాది పండగ తర్వాత పూర్తి స్థాయి చికిత్స చేయించుకోనున్నారు.