అమెరికా చీఫ్ డొనాల్డ్ ట్రంప్ షాక్
NEWS Mar 27,2025 04:33 am
అమెరికా దేశ అధ్యక్షుడిగా కొలువు తీరాక డొనాల్డ్ ట్రంప్ రోజుకో సంచలన నిర్ణయం తీసుకుంటున్నారు. ఆ దేశ ప్రజలతో పాటు అక్కడ నివసిస్తున్న ప్రవాస భారతీయులు, ఇతర విదేశీయులకు కోలుకోలేని రీతిలో షాక్ ఇస్తూ వస్తున్నారు. ఇప్పటికే గ్రీన్ కార్డ్స్, హెచ్1బి , తదితర వీసాల విషయంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తాజాగా మరో షాకింగ్ నిర్ణయం విదేశీ కార్లపై 25 శాతం సుంకం విధిస్తున్నట్లు ప్రకటించారు. కార్లతో పాటు లైట్ ట్రక్ లకు కూడా ఇది వర్తిస్తుందని స్పష్టం చేశారు.