మంత్రి కోమటిరెడ్డిని బీఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పరామర్శించారు. నియోజకవర్గంలో పెండింగ్ పనుల విషయంలో తనను కలిశాడని చెప్పారు. సుధీర్ రెడ్డి తనకు బంధువు అవుతాడని, స్వయంగా అల్లుడని పేర్కొన్నారు. పార్టీలోకి తీసుకుంటారా అని ప్రశ్నిస్తే అది తన పని కాదన్నారు. ఇక సోదరుడు రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి వస్తుందో రాదోనన్న విషయం తనకు తెలియదన్నారు. ఈ విషయం పార్టీ హైకమాండ్ చూసుకుంటుందని చెప్పారు కోమటిరెడ్డి.