ప్రముఖ సంగీత దర్శకుడు ఎస్ఎస్ థమన్ మ్యూజికల్ నైట్ నిర్వహించనున్నారు. టాటా ఇండియన్ ప్రిమీయర్ లీగ్ (ఐపీఎల్ ) 2025 మెగా టోర్నీలో భాగంగా హైదరాబాద్ లోని ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో థమన్ మ్యూజిక్ షో ఉండనుంది. ఎల్లుంటి ఇదే వేదికపై సన్ రైజర్స్ హైదరాబాద్ లక్నో సూపర్ జెయింట్స్ జట్ల మధ్య కీలక మ్యాచ్ జరగనుంది. తొలి మ్యాచ్ లో ఎస్ ఆర్ హెచ్ టీం రాజస్థాన్ రాయల్స్ జట్టును ఓడించింది. రేపటి మ్యాచ్ కు ముందు తమన్ తో సంగీత కార్యక్రమం చేపట్టనున్నారు.