పెద్దపల్లి మున్సిపాలిటీ పరిధిలోని రంగంపల్లి సెయింట్ యాన్స్ హైస్కూల్ లో 9వ తరగతి చదువుతున్న అమరనాథ్ అనే విద్యార్థి హనుమాన్ మాల ధరించాడు. దీనిపై అభ్యంతరం చెబుతూ స్కూల్ లోకి అనుమతించ లేదు. దీంతో ఆంజనేయస్వామి మాలధారులు పెద్ద ఎత్తున పాఠశాల వద్దకు చేరుకున్నారు. వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. యాజమాన్యంతో వాగ్వాదానికి దిగారు. స్కూల్ ఇంఛార్జ్ దేవదాస్ పై దాడి చేసేందుకు యత్నించారు.