అక్రమ అరెస్ట్ లపై బీఆర్ఎస్ ఫైర్
NEWS Mar 24,2025 08:57 am
కరీంనగర్ లో నిర్వహించిన బీఆర్ఎస్ రజతోత్సవ సమావేశానికి హాజరు కాకుండా తమను అరెస్ట్ చేయడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు మండల అధ్యక్షుడు తోట శ్రీనివాస్. అక్రమ అరెస్ట్ లు మంచి పద్దతి కాదన్నారు. డెమోక్రసీలో ప్రతి ఒక్కరికీ నిరసన తెలిపే హక్కు ఉంటుందన్నారు. తమ పార్టీ సమావేశానికి వెళుతుంటే అరెస్ట్ చేయడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు. అరెస్ట్ అయిన వారిలో మాజీ జెడ్పీటీసీ శ్రీనివాస్ రెడ్డి, మాజీ సింగిల్ విండో చైర్మన్ ఆది రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ బద్దం అంజిరెడ్డి, కళ్లెం మైపాల్ రెడ్డి, కొమ్ముల జీవన్ రెడ్డి, వన తడపుల నాగరాజు, ఎక్స్ డైరెక్టర్ పెద్దిరెడ్డి లక్ష్మణ్ ఉన్నారు.