ఓట్ల కోసం హామీలు ఎగవేతకు కొర్రీలు
NEWS Mar 23,2025 02:10 pm
మాజీ మంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు. ఎక్స్ వేదికగా ఫైర్ అయ్యారు. 420 అబద్దపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందన్నారు. కాంగ్రెస్ చేయని శపథం లేదన్నారు. చట్ట సభల సాక్షిగా వరంగల్ డిక్లరేషన్ కు తూట్లు పొడిచారని ఆరోపించారు. అధికారం కోసం అందరికీ రుణ మాఫీ అన్నారని, కొలువు తీరాక కొందరికే సరి పెట్టారంటూ మండిపడ్డారు. కుటుంబంతో సంబంధం లేకుండా రూ. 2 లక్షలు రుణ మాఫీ చేస్తామన్నారు. ఇప్పుడు చూస్తే ఒక్కరికే అది వర్తిస్తుందంటూ చావు కబురు చల్లగా చెప్పారంటూ ఎద్దేవా చేశారు.