అభివృద్ధి పనులను పరిశీలించిన డిప్యూటీ కమిషనర్
NEWS Mar 23,2025 02:11 pm
ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం డిప్యూటీ కమిషనర్ చక్రధరరావు ఆలయ సమీపంలో గల కోనేరు లో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. పనులు పురోగతి పై సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. త్వరలో జరగనున్న వార్షిక కళ్యానోత్సవాలకు కోనేరు పనులు పూర్తి చేయాలని ఈ సందర్భంగా సిబ్బందికి పలు సూచనలు చేశారు .