తెలంగాణలో రాబోయే రాజ్యం మనదే
NEWS Mar 23,2025 09:03 am
బీఆర్ఎస్ బాస్, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ ఒంటరిగానే పోటీ చేస్తుందన్నారు. కాంగ్రెస్ పాలన గతి తప్పిందన్నారు. సీఎం ఉన్నా లేనట్టేనంటూ ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో ఎవరు ఔనన్నా కాదన్నా వచ్చేది గులాబి దళమేనని కుండ బద్దలు కొట్టారు. దేశంలోనే అత్యంత ధనిక రాష్ట్రం తెలంగాణ అని, దానిపై కొందరు కన్నేశారని ఆరోపించారు. పరోక్షంగా ఏపీ సీఎం చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. మొత్తంగా కేసీఆర్ మరోసారి తనకు ఎదురే లేదని చాటారు.