గంజాయి స్వాధీనం..ఇద్దరు అరెస్ట్
NEWS Mar 08,2025 03:47 pm
మెట్ పల్లి శివారులో పోలీసులు వాహనాలను తనిఖీ చేశారు. ద్విచక్ర వాహనంపై అనుమానాస్పదంగా కనిపించిన ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 200 గ్రాముల గంజాయి, సెల్ ఫోన్, ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నారు. నునావత్ సాయి నాయక్, అజ్మీరా శ్రీనివాస్ నాయక్ లపై కేసు నమోదు చేసినట్లు సీఐ నిరంజన్ రెడ్డి తెలిపారు.