సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. మహిళా దినోత్సవం సందర్బంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా జరిగిన మీటింగ్ లో గతంలో ఆర్టీసీలో కండక్టర్లుగా మహిళలను పెట్టింది తానేనని చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా మహిళా స్వయం సహాయక సంఘాలను ఏర్పాటు చేసింది కూడా తానేనని అన్నారు. మహిళలకు షీ ఆటోలు కూడా ఇచ్చామన్నారు. ప్రస్తుతం ర్యాపిడోతో ఒప్పందం చేసుకుంటున్నట్లు చెప్పారు. వినూత్న ఆలోచనలతో ముందుకు వెళుతున్నామన్నారు. ఇవాళ మహిళా సాధికారత కోసం ఎంత ఖర్చు చేసేందుకైనా వెనుకాడబోమని ప్రకటించారు.