ములుగు జిల్లా తాడ్వాయి జలగలంచ తోగు అడవి సమీపంలోని దుర్గంగుట్ట పై మహిళా అస్థిపంజరం లభ్యమైంది. జలగలంచ గొత్తికోయ గూడెంకు చెందిన కుంజ అడమి 6 నెలల క్రితం భర్తతో గొడవ పడి ఇంట్లో నుంచి వెళ్ళిపోయినట్లు పోలీసుల విచారణలో తేలింది. పోలీసులు, వైద్యులు సంఘటన స్థలానికి చేరుకుని పంచనామ నిర్వహించారు. మహిళది హత్యా..? ఆత్మహత్యా..? అనే దిశగా తాడ్వాయి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.