స్టేడియంల ఆధునీకరణకు నిధులివ్వండి
NEWS Mar 08,2025 01:27 pm
రాష్ట్రంలో స్టేడియం నిర్మాణాలు, ఆధునీకరణకు నిధులు పెద్ద ఎత్తున ఇవ్వాలని కేంద్రాన్ని కోరడం జరిగిందన్నారు మంత్రి రాం ప్రసాద్ రెడ్డి. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం రెన్నోవేషన్ కోసం రూ. 27.48 కోట్లు మంజూరు చేయాలని విన్నవించామని చెప్పారు. ఖేలో ఇండియా పథకం ద్వారా పలు ప్రాజెక్టులు, క్రీడా మౌలిక సదుపాయాల కల్పన కోసం నిధులు విడుదల చేయాలని ఇప్పటికే తెలిపామన్నారు. రాయచోటిలో క్రీడా సముదాయ నిర్మాణం కోసం కేంద్రం నుండి రూ. 42.62 కోట్ల రూపాయలు సాయంగా ఇవ్వాలని కోరామన్నారు.