సంగారెడ్డి జిల్లా నాగలి గిద్ద మండలంలోని ముక్తాపూర్ గ్రామంలోని ప్రాథమిక ఉన్నంత పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవం, ఫేర్వెల్ పార్టీని ఘనంగా నిర్వహించారు నాగలిగిద్ద మండల పిఆర్టియు అధ్యక్షులు సేరికర్ రమేష్. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రైవేట్ పాఠశాలలు వద్దు ప్రభుత్వ పాఠశాలలే ముద్దు అనే నినాదంతో గ్రామంలో ఉండే ప్రతి విద్యార్థి ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకోవాలని వారికి అవసరమైన అన్ని విధాల సౌకర్యాలు ప్రభుత్వ పాఠశాలలోనే అందించాలని ఉపాధ్యాయులకు సూచించారు.