తిరుమలకు పోటెత్తిన భక్తజనం
NEWS Mar 08,2025 10:36 am
తిరుమల పుణ్య క్షేత్రం భక్తులతో కిటకిట లాడుతోంది. శ్రీ వేంకటేశ్వర స్వామి, శ్రీ అలివేలు మంగమ్మలను 67 వేల 127 మంది భక్తులు దర్శించుకున్నారు. 22 వేల 910 మంది తలనీలాలు సమర్పించారు. కానుకలు, విరాళాల రూపేణా శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.47 కోట్లు వచ్చినట్లు వెల్లడించారు ఈవో జె. శ్యామల రావు. స్వామి వారి దర్శనం కోసం ప్రస్తుతం భక్తులు 9 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారని, ఎలాంటి టోకెన్లు లేని భక్తులకు 10 గంటలకు పైగా సమయం పడుతుందన్నారు.