కందుల కొనుగోలు కేంద్రం ప్రారంభించిన అడ్లూరి
NEWS Mar 07,2025 11:17 pm
ధర్మారం మండల వ్యవసాయ మార్కెట్ యార్డులో చేసిన కందుల కొనుగోలు కేంద్రాన్ని అధికారులు మండల నాయకులతో కలిసి ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రారంభించారు. కొనుగోళ్లకు వచ్చే రైతులకు ఎటువంటి ఇబ్బందులూ కలగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని, రైతులు కేవలం వరి మాత్రమే కాకుండా ఇతర పంటల సాగు వైపు కూడా దృష్టి సారించాలని, కొనుగోళ్ల విషయంలో ఎటువంటి సమస్య ఉన్న తన దృష్టికి తీసుకురావాలని కోరారు.